వార్తలకు తిరిగి వెళ్లండి

అయోధ్య రామమందిర విరాళాల చోరీ కేసులో సిట్ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగుచూశాయి. ప్రధాన నిందితుడు అవినాష్ శుక్లా తన ఖాతా నుంచి రూ.15 లక్షలకు పైగా నగదు లావాదేవీలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ చోరీ సొమ్ముతోనే తన స్నేహితురాలికి రూ.2 లక్షల నగదుతో పాటు ఓ ఖరీదైన స్మార్ట్ ఫోన్ బహుమతిగా ఇచ్చినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
ఆలయంలో విధులు ముగిశాక అవినాష్ నిత్యం భారీగా నగదు తెచ్చేవాడని అతని సోదరుడు తెలిపాడు. ఆ డబ్బును భక్తులు సంతోషంతో ఇచ్చారని మరో నిందితుడు అనుకల్ప్ బుకాయించినట్లు విచారణలో తేలింది. దీనిపై పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.
Comments
Loading comments...

