Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హీటర్‌ షాక్‌తో మహిళ మృతి

Follow Udayam on Google
రూప దేవి Jul 28, 2026 7:55 AM హైదరాబాద్General
హీటర్‌ షాక్‌తో మహిళ మృతి - Udayam
మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఎలక్ట్రిక్‌ వాటర్‌ హీటర్‌ వాడుతున్న సమయంలో కరెంట్‌ షాక్‌కు గురై స్వాతి(40) అనే మహిళ మృతి చెందింది. ఘటన సమయంలో ఇంట్లో ఆమె ఒక్కరే ఉండటం విషాదం నింపింది. భర్త ఉద్యోగానికి, పిల్లలు పాఠశాలకు వెళ్లిన తర్వాత ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...