Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శారదా నదిలో దూకి వివాహిత ఆత్మహత్య

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 08, 2026 6:49 AM అనకాపల్లి General
శారదా నదిలో దూకి వివాహిత ఆత్మహత్య - Udayam
అనకాపల్లిలో విషాదం చోటుచేసుకుంది. చూచుకొండ గ్రామానికి చెందిన మళ్ల అనూష (31) శారదా నది వంతెనపై నుంచి నీటిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు. మొదటి భర్త మరణించడంతో రెండేళ్ల క్రితమే రెండో పెళ్లి చేసుకున్న ఆమె, పసిపిల్లలను వదిలి ఆత్మహత్య చేసుకోవడం కలచివేసింది. కుటుంబ కలహాలే కారణమని భావిస్తూ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...