Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మత్స్యకారుల తీవ్ర ఆగ్రహం

మహేష్ కుమార్ Jul 07, 2026 3:10 PM విశాఖపట్నం 0 viewsabout 3 hours ago
మత్స్యకారుల తీవ్ర ఆగ్రహం - Udayam Digital
బోటు ప్రమాదంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ లభించకుండానే సెర్చ్ ఆపరేషన్ ముగిస్తామని ఫిషరీస్ కమిషనర్ ప్రకటించారు. ఈ నిర్ణయంపై కూటమి ప్రభుత్వంపై మత్స్యకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ వారి ఆచూకీ దొరకకుండా గాలింపు చర్యలను ఎలా నిలిపివేస్తారని హార్బర్‌లోనే బాధిత కుటుంబాలు ఆందోళనకు దిగాయి. కష్టకాలంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై వారు తీవ్రంగా మండిపడుతున్నారు.

Comments

G
Loading comments...