Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైకాపా నేత నాగార్జున యాదవ్ అరెస్ట్

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jul 12, 2026 7:31 PM అమరావతిGeneral
వైకాపా నేత నాగార్జున యాదవ్ అరెస్ట్ - Udayam
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో వైకాపా అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు ఇన్నర్‌ రింగ్‌రోడ్డులోని ఆయన నివాసానికి చేరుకున్న పోలీసులు, తాము తెలంగాణ పోలీసులమని కుటుంబ సభ్యులకు తెలిపి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఓ టీవీ ఛానల్ చర్చా కార్యక్రమంలో సీఎం రేవంత్‌ను ఉద్దేశించి ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈ అరెస్ట్ జరిగినట్లు సమాచారం.

Comments

G
Loading comments...