Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆ ప్రభుత్వ భూములు ఎవరి సొత్తు?

Vikram Jun 20, 2026 6:31 AM తూర్పుగోదావరి 12 views2 days ago
ఆ ప్రభుత్వ భూములు ఎవరి సొత్తు? - Udayam Digital
ఆర్అండ్‌బీ, జలవనరుల శాఖలకు చెందిన ప్రభుత్వ స్థలాలను అక్రమార్కులు యథేచ్ఛగా ఆక్రమిస్తున్నారు. రోడ్లు, కాలువ గట్ల పక్కన దుకాణాలు నిర్మించి, వాటిని దర్జాగా అద్దెలకు ఇస్తూ సొమ్ము చేసుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. మరోవైపు సామాన్యులకు చుక్కలు చూపించే విద్యుత్ శాఖ, ఈ అక్రమ నిర్మాణాలకు సులువుగా కనెక్షన్లు ఇచ్చేయడం గమనార్హం. దీనిపై విచారణ జరిపి ఆక్రమణదారులకు నోటీసులు ఇస్తామని స్థానిక పంచాయతీ అధికారులు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...