వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరు కార్పొరేషన్ కార్యాలయంలో పన్నులు స్వీకరించాల్సిన అధికారులు సమయానికి హాజరుకాక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం 10.30 దాటినా పన్నుల విభాగంతో పాటు అకౌంట్స్ శాఖలో పలువురి కుర్చీలు ఖాళీగా కనిపించాయి.
పన్నులు చెల్లించేందుకు వచ్చిన ప్రజలు నిరీక్షించాల్సి వచ్చింది. ఈ పరిస్థితిపై అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రజలు అధికారులు సమయపాలన పాటించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

