Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవీన్ గ్యాప్ వెనుక అసలు రహస్యం?

Follow Udayam on Google
Soumya Bhattacharya Jun 18, 2026 10:19 AM జాతీయంGeneral
నవీన్ గ్యాప్ వెనుక అసలు రహస్యం? - Udayam
మంచి కథ కోసమే తాను పదేళ్లు విరామం తీసుకున్నానని నటుడు వడ్డే నవీన్ తెలిపారు. ఆయన ముఖ్య పాత్రలో నటించిన 'ట్రాన్స్‌ఫర్‌ త్రిమూర్తులు' చిత్రం జూన్ 19న విడుదలవుతున్న నేపథ్యంలో బుధవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశంలో నవీన్ మాట్లాడారు. ఇది 55 సార్లు బదిలీ అయిన ఓ నిజాయతీ గల కానిస్టేబుల్ కథని, కుటుంబమంతా కలిసి చూసే థ్రిల్లర్ అని చెప్పారు. కథలు నచ్చితే ఓటీటీలు, మల్టీస్టారర్లలో నటించేందుకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...