వార్తలకు తిరిగి వెళ్లండి
రైతుల కోసం ఎంత రక్తమైనా ధారపోస్తాం : కేటీఆర్

కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 60 ఏళ్ల పాటు తెలంగాణ నెత్తురు తాగినా ఆ పార్టీకి రక్తదాహం తీరలేదా అని 'ఎక్స్' వేదికగా ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది ప్రాణాలను బలితీసుకున్న చరిత్ర కాంగ్రెస్‌దేనని విమర్శించారు. .
రాష్ట్ర సాధన కోసం పేగులు తెగేలా కొట్లాడిన తాము, ఇప్పుడు రైతుల కోసం ఎంత రక్తమైనా ధారపోసేందుకు సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. తమ రక్తం ఎంత కావాలంటే అంత పంపిస్తామని, మీ రక్తదాహం తీర్చుకుని రైతుల పొలాలకు మాత్రం వెంటనే సాగునీరు అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...