Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విత్తనాల కొరత లేకుండా చూడాలి: కలెక్టర్ అనురాగ్

Follow Udayam on Google
సాయి తేజ Jul 12, 2026 8:50 PM యాదాద్రి భువనగిరిGeneral
విత్తనాల కొరత లేకుండా చూడాలి: కలెక్టర్ అనురాగ్ - Udayam
వలిగొండ మండల కేంద్రంలోని గ్రోమోర్ ఎరువుల దుకాణాన్ని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణంలో ఉన్న నిల్వలను, ఫర్టిలైజర్ యాప్ ద్వారా జరుగుతున్న అమ్మకాల వివరాలను ఆయన స్వయంగా పరిశీలించారు. ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా వరి పంటకు బదులుగా పత్తి, కందులు వంటి ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. అలాగే, యూరియా కోసం రైతులు మీ సేవా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

Comments

G
Loading comments...