Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మావోయిస్టుల డంప్ ధ్వంసం.. రూ.16 లక్షల బంగారం, నగదు స్వాధీనం

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 12, 2026 8:55 PM ఖమ్మంGeneral
మావోయిస్టుల డంప్ ధ్వంసం.. రూ.16 లక్షల బంగారం, నగదు స్వాధీనం - Udayam
ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లా తోడ్మా అడవుల్లో మావోయిస్టులు దాచి ఉంచిన భారీ డంపును భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇటీవల లొంగిపోయిన మావోయిస్టులు ఇచ్చిన సమాచారం మేరకు బర్సూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అదనపు ఎస్పీ జితేంద్ర కుమార్ ఖుంటే నేతృత్వంలో ఈ ఆకస్మిక ఆపరేషన్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో రూ.16 లక్షల విలువైన 116 గ్రాముల బంగారం బిస్కెట్లు, రూ. 2 లక్షల నగదుతో పాటు భారీగా ఆయుధాలు, పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు దంతేవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ వెల్లడించారు. ఆ ప్రాంతంలో నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ నిరంతరం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...