వార్తలకు తిరిగి వెళ్లండి

జోగులాంబ గద్వాల జిల్లా కొత్త రాజోలి పునరావాస కాలనీలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని భాజపా నేత రామచంద్రారెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన కాలనీని పరిశీలించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.
2009 వరద బాధితులకు కేటాయించిన ఈ గృహాలలో రోడ్లు, డ్రైనేజీ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. చేనేత కార్మికుల మగ్గం గుంతల్లో నీరు చేరి ఉపాధి కోల్పోతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి వసతులు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

