Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ లో సర్‌ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్‌

Follow Udayam on Google
పవన్ కుమార్ Jul 12, 2026 8:51 PM నిర్మల్ General
నిర్మల్ లో సర్‌ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్‌ - Udayam
నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని కల్లూరులో కొనసాగుతున్న ‘సర్‌’ (SER) ప్రక్రియను జిల్లా కలెక్టర్ భవేశ్‌ మిశ్రా పరిశీలించారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసి వంద శాతం పూర్తి చేసిన సిబ్బందికి అవార్డులు అందజేస్తామని ఆయన ప్రకటించారు. ప్రస్తుతం ఈ పనులను వేగంగా పూర్తి చేయడంలో కుంటాల మండలం జిల్లాలో ప్రథమ స్థానంలో, రాష్ట్రంలో రెండవ స్థానంలో నిలవడంపై సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. ఇప్పటికే 68 శాతం డిజిటైజేషన్ పూర్తి కావడం శుభపరిణామన్న ఆయన.. అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఎలాంటి పొరపాట్లు లేకుండా పారదర్శకంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...