Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ వరప్రదాయిని దేవాదుల - కడియం శ్రీహరి

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jul 12, 2026 8:53 PM వరంగల్General
వరంగల్ వరప్రదాయిని దేవాదుల - కడియం శ్రీహరి - Udayam
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 6 లక్షల ఎకరాలకు సాగు, తాగు నీరందిస్తూ దేవాదుల ఎత్తిపోతల పథకం వరప్రదాయినిగా మారిందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఆదివారం ఆయన ధర్మసాగర్ జలాశయంలో గోదావరి ఎత్తిపోతల పథకం ద్వారా జరుగుతున్న నీటి పంపింగ్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన.. ప్రస్తుతం నడుస్తున్న పంపులు, పంపింగ్ చేయాల్సిన మోటార్ల వివరాలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో దేవాదుల సీఈ సుధీర్, ఎస్ఈ సీతారాం మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...