Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాంసి ప్రభుత్వ కార్యాలయాల్లో నీటి సమస్య

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Jun 25, 2026 4:29 PM ఆదిలాబాద్General
తాంసి ప్రభుత్వ కార్యాలయాల్లో నీటి సమస్య - Udayam
తాంసి మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల ఆవరణ వర్షపు నీటితో చెరువును తలపిస్తోంది. డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో, వారం పది రోజుల పాటు నీరు నిలిచిపోయి ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గోడలను పట్టుకుని కార్యాలయాల్లోకి నడవాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి డ్రైనేజీ కాలువలను నిర్మించి, నీటి నిల్వ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...