Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రిజర్వాయర్లలో అడుగంటిన జలాలు

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Jul 11, 2026 2:46 PM హైదరాబాద్General
రిజర్వాయర్లలో అడుగంటిన జలాలు - Udayam
ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో తెలంగాణలోని ప్రధాన రిజర్వాయర్లు క్రమంగా అడుగంటుతున్నాయి. సాధారణంగా ఏటా జూలై నాటికి ప్రాజెక్టుల్లో దాదాపు 600 టీఎంసీల నీటి నిల్వలు ఉండేవి. కానీ, ఈ ఏడాది ప్రస్తుతం కేవలం 340 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉండటం గమనార్హం. కృష్ణా బేసిన్‌లోని జూరాల, తుంగభద్ర, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో కలిపి కేవలం 220 టీఎంసీల నిల్వలు మాత్రమే ఉన్నాయి.

Comments

G
Loading comments...