వార్తలకు తిరిగి వెళ్లండి

బుడమేరుకు వరద ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శుక్రవారం అధికారులతో కలిసి పర్యటించారు. పుట్టగుంట వంతెన వద్ద ప్రమాదకర స్థాయిలో ఉన్న వరద ప్రవాహాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.
వరద ముప్పు దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సహాయక చర్యలను ముమ్మరం చేసి, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

