వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం నగరపాలక సంస్థలో వార్డు ఆఫీసర్ నగదు తీసుకుంటున్నట్లు కనిపిస్తున్న వీడియో వెలుగుచూడడంతో కలకలం రేగింది. ఇందిరమ్మ బిల్లులకు సంబంధించి లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలపై ఇప్పటికే ఆడియోలు కూడా వైరల్ అయ్యాయి.
ఈ వ్యవహారంపై త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన అధికారులు విచారణ చేపట్టారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగిని విధులకు రావద్దని మౌఖికంగా ఆదేశించినట్లు సమాచారం.
Comments
Loading comments...
