Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లీక్ అయిన మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌

Follow Udayam on Google
Kiran Sep 03, 2026 2:55 PM వనపర్తిGeneral
 లీక్ అయిన మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌  - Udayam
వనపర్తి జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్‌ వెళ్లే SH-21పై నర్సింగాయపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలోని HP పెట్రోల్‌ బంక్‌ వద్ద మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ నుంచి భారీగా నీరు లీకవుతోంది. దీంతో తాగునీరు వృథాగా పోతూ రోడ్డుపైకి చేరుతోంది. ఆన్‌-ఆఫ్‌ వాల్వ్‌ వద్ద లీకేజీ ఏర్పడినట్లు స్థానికులు తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి లీకేజీని అరికట్టి తాగునీటి వృథాను నివారించాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...