Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.7 లక్షల బంగారం అప్పగించిన వాల్తేరు డిపో కండక్టర్లు

Follow Udayam on Google
SHRUTHI Aug 30, 2026 8:29 AM విశాఖపట్నంGeneral
రూ.7 లక్షల బంగారం అప్పగించిన వాల్తేరు డిపో కండక్టర్లు - Udayam
బస్సుల్లో ప్రయాణికులు పోగొట్టుకున్న సుమారు రూ.7 లక్షల విలువైన బంగారు ఆభరణాలను తిరిగి అప్పగించి వాల్తేరు డిపో కండక్టర్లు నిజాయతీ చాటుకున్నారు. 900కే బస్సులో రూ.4 లక్షల బ్రేస్‌లెట్‌ను కండక్టర్‌ పి.వి.ప్రసాద్‌ గుర్తించి అధికారులకు అప్పగించారు. 60సి బస్సులో రూ.3 లక్షల బంగారు గొలుసును కండక్టర్‌ పి.ఆర్‌.కుమారి గుర్తించి అధికారులకు అందించారు మరియు అనంతరం వాటిని సంబంధిత ప్రయాణికులకు అప్పగించారు.

Comments

G
Loading comments...