వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుదాఘాతంలో రెండు చేతులు కోల్పోయిన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలానికి చెందిన ఆత్రం అన్నిగకు మూడేళ్లు గడిచినా నష్టపరిహారం, దివ్యాంగుల పింఛన్ అందలేదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు.
2023లో విద్యుత్తు పనుల సమయంలో ప్రమాదానికి గురైన అన్నిగకు సదరం ధ్రువపత్రం జారీ అయినా పింఛన్ మంజూరు కాలేదని తెలిపారు. పరిహారం, పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Comments
Loading comments...

