వార్తలకు తిరిగి వెళ్లండి

బిక్కనూరు మండల కేంద్రం నుంచి అంతంపల్లి వెళ్లే మార్గంలోని వ్యవసాయ బావుల వద్ద గుర్తుతెలియని వ్యక్తులు కేబుల్ వైర్లను చోరీ చేసినట్లు రైతులు పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు.
సుమారు 20 వ్యవసాయ బావుల వద్ద కేబుల్ వైర్లు అపహరించుకుపోయారని బాధిత రైతులు లిఖితపూర్వకంగా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

