వార్తలకు తిరిగి వెళ్లండి
కుబీర్ మండలంలోని పార్డి(బి) గ్రామాన్ని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. గ్రామానికి చెందిన గుడాల సాయినాథ్ (47) బ్రహ్మేశ్వర్ జలపాతం గుండంలో మునిగి మృతి చెందాడు. శ్రావణ శనివారం సందర్భంగా శివాలయం దర్శనానికి వెళ్లిన ఆయన స్నానం చేస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
ఇటీవలే నలుగురు గ్రామస్థులను రోడ్డు ప్రమాదంలో కోల్పోయిన విషాదం నుంచి తేరుకోకముందే మరో ప్రాణం పోవడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
Comments
Loading comments...

