Udayam Digital
Menu

వరి కొయ్యలను కాల్చొద్దు: వ్యవసాయ అధికారి

Sai Nath Nov 20, 2026 3:19 PM మంచిర్యాలGeneral
వరి కొయ్యలను కాల్చొద్దు: వ్యవసాయ అధికారి - Udayam Digital
నెన్నెల మండలంలో రైతులు వరి పంట కోత అనంతరం మిగిలిన వరి కొయ్యలను కాల్చవద్దని మండల వ్యవసాయ అధికారి పుప్పాల సృజన అవగాహన కల్పించారు. పంట అవశేషాలను కాల్చడం వల్ల నేలలోని మిత్ర పురుగులు, సేంద్రియ పదార్థాలు నశించడంతో పాటు పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని వివరించారు. కొయ్యలను నేలలో కలియదున్నడం ద్వారా భూసారం పెరుగుతుందని సూచించారు. రైతులు పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని ఆమె కోరారు.

Comments

G
Loading comments...