Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్ధన్నపేటలో 108 సిబ్బంది సమయస్ఫూర్తి

Follow Udayam on Google
Kiran Nov 02, 2026 11:08 AM వరంగల్General
వర్ధన్నపేటలో 108 సిబ్బంది సమయస్ఫూర్తి - Udayam
వర్ధన్నపేట మండలం కట్రియాల గ్రామానికి చెందిన చింగల రాజు (45) సోమవారం కిందపడి కదలలేని స్థితిలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న EMT క్రాంతి కుమార్, పైలట్ సృజన్ పరీక్షించగా బీపీ, షుగర్ స్థాయులు తగ్గినట్లు గుర్తించారు. ప్రాథమిక చికిత్స అందించి రాజును ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. సకాలంలో స్పందించి చికిత్స అందించడంతో ఆయన ప్రాణాలు కాపాడినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...