Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వృద్ధురాలికి త్రిచక్ర వాహనం సమకూర్చిన 16 మంది మిత్రులు!

Follow Udayam on Google
md jabeer Aug 14, 2026 8:40 AM నిర్మల్General
వృద్ధురాలికి త్రిచక్ర వాహనం సమకూర్చిన 16 మంది మిత్రులు! - Udayam
రాంపూర్ గ్రామానికి చెందిన 16 మంది యువకులు మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రమాదంలో కాలు కోల్పోయి, పాత తోపుడు బండి చెడిపోవడంతో ఇబ్బంది పడుతున్న వృద్ధురాలు పోచమ్మల సాయవ్వ కష్టాలు చూసి చలించారు. అందరూ కలిసి చందాలు వేసుకొని, ఆమె స్వయంగా నడుపుకోగలిగే నూతన త్రిచక్ర వాహనాన్ని కొనుగోలు చేసి బహూకరించారు. ఎవరి సహాయం లేకుండా ఇకపై తాను తిరగవచ్చని వృద్ధురాలు కన్నీళ్లతో యువకులను దీవించింది.

Comments

G
Loading comments...