వార్తలకు తిరిగి వెళ్లండి

రాజుపాలెం మండలం పెదనెమలిపురిలో 80 ఏళ్ల వెంకటరావమ్మ ఇంట్లోకి చొరబడి 4 బంగారు గాజులు, ఉంగరం దోచుకెళ్లిన నిందితుడు శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు.
కొండమోడు జంక్షన్ సమీపంలో అతడిని అదుపులోకి తీసుకుని, చోరీకి గురైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. డీఎస్పీ కృష్ణ చైతన్య, సీఐ కిరణ్, ఎస్సై మణికృష్ణల పర్యవేక్షణలో ఈ కేసును వేగంగా ఛేదించినట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

