Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరద ఉద్ధృతికి మత్తడి విలవిల

Follow Udayam on Google
Saychi kumar Aug 26, 2026 4:09 PM కామరెడ్డిGeneral
వరద ఉద్ధృతికి మత్తడి విలవిల - Udayam
నర్సింగ్రావుపల్లి శివారులోని నల్లవాగు మత్తడి ఉద్ధృతంగా పొంగిపొర్లుతోంది. మత్తడి ఇప్పటికే శిథిలావస్థకు చేరుకోవడంతో భారీ వరదలకు పెద్ద గండ్లు ఏర్పడుతున్నాయి. గోడలు కూలిపోగా, బండరాళ్లు కొట్టుకుపోతున్నాయి. మత్తడి కి గండ్లు ఏర్పడటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మత్తడి కొట్టుకుపోతే పంటలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని రైతులు చెబుతున్నారు. అధికారులు పరిశీలించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...