Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరేండ్ల తర్వాత.. వొడాఫోన్ ఐడియాకు భారీ లాభాలు!

Follow Udayam on Google
Priyanka Chaturvedi May 18, 2026 11:21 AM జాతీయంబిజినెస్
ఆరేండ్ల తర్వాత.. వొడాఫోన్ ఐడియాకు భారీ లాభాలు! - Udayam
టెలికాం రంగ సంస్థ వొడాఫోన్‌ ఐడియా (Vi) ఎట్టకేలకు లాభాల బాట పట్టింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో (Q4) సంస్థ ఏకంగా రూ.51,970 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని గడించింది. గత ఆరేండ్లలో కంపెనీ లాభాలను ప్రకటించడం ఇదే ప్రథమం. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.7,167 కోట్ల నష్టాన్ని నమోదు చేసుకున్న వొడాఫోన్ ఐడియా.. ఈసారి ఊహించని రీతిలో పుంజుకుంది. కాగా, సమీక్షా కాలంలో కంపెనీ కన్సాలిడేటెడ్‌ ఆదాయం 3 శాతం వృద్ధితో రూ.11,332 కోట్లకు చేరుకుంది.

Comments

G
Loading comments...