వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల కేంద్రంలో అధికారులు వనమహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్మశాన వాటిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలలో మొక్కలు నాటారు.
ప్రకృతిని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో భీమేష్, సర్పంచ్ సాయినాథ్, ఆత్మ చైర్మన్ వివేకానంద తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని వారు పేర్కొన్నారు.
Comments
Loading comments...

