వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ‘వందేమాతరం’ ఆలపిస్తున్న సమయంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నిర్లక్ష్యంగా వ్యవహరించి, జాతీయ గేయాన్ని అవమానించారని బీజేవైఎం మండిపడింది.
దీనికి నిరసనగా జిల్లా అధ్యక్షుడు సంగ నరేష్ ఆధ్వర్యంలో కరీంనగర్ కోర్టు చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. దేశ ప్రజల మనోభావాలు దెబ్బతీసిన కాంగ్రెస్ అగ్రనేతలు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

