వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖపట్నం ఎన్ఏడీ ఫ్లైఓవర్‌పై బుధవారం అర్ధరాత్రి భారీ కంటెయినర్ బోల్తా పడింది. గాజువాక నుంచి నగరం వైపు వెళ్తున్న కంటెయినర్, ఫ్లైఓవర్ రోటరీ వద్ద మలుపు తిరుగుతుండగా అదుపుతప్పి బోల్తాపడింది.
ప్రమాద సమయంలో రద్దీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న కంచరపాలెం ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. క్రేన్ల సాయంతో కంటెయినర్‌ను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు.
Comments
Loading comments...

