Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ బోటు ప్రమాదం: బాధితులకు పరిహారం

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Jul 09, 2026 11:17 AM విశాఖపట్నంGeneral
విశాఖ బోటు ప్రమాదం: బాధితులకు పరిహారం - Udayam
విశాఖపట్నం తీరంలో బోటు మునిగిపోయి గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 10 లక్షల చొప్పున పరిహారం అందించింది. విశాఖలోని హార్బర్ మెకనైజ్డ్ బోట్ అసోసియేషన్ భవనంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్ లతో కలిసి పరిహారం చెక్కులను అందజేశారు. సంఘటన జరిగిన వెంటనే నావికాదళం, కోస్ట్‌గార్డ్ సహాయంతో సహాయక చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...