వార్తలకు తిరిగి వెళ్లండి
రోడ్డుపై గొడవ.. ఇద్దరు డ్రైవర్లు దుర్మరణం

ప్రకాశం జిల్లా ఏడుగుండ్లపాడు జాతీయ రహదారిపై లారీ సైడ్ ఇవ్వలేదనే కారణంతో ఇద్దరు డ్రైవర్లు రోడ్డుపై ఆగి వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో ఓవర్‌టేక్ చేయబోయిన ప్రైవేట్ బస్సు వీరిని బలమైన వేగంతో ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో డ్రైవర్ మురుగేష్ అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్రంగా గాయపడిన మరో డ్రైవర్ సుబ్రహ్మణ్య ప్రసాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...