Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విప్లవోద్యమ నేత రాధాక్క మృతి

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Aug 31, 2026 11:39 PM ఆదిలాబాద్General
విప్లవోద్యమ నేత రాధాక్క మృతి - Udayam
ఆదిలాబాద్‌ : విప్లవోద్యమంలో దాదాపు మూడు దశాబ్దాలు పనిచేసిన కుర్సంగె మోతి బాయి (రాధాక్క) సోమవారం రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. 1984లో ఉద్యమంలో చేరిన ఆమె సిర్పూర్‌ దళంలో, ఆదిలాబాద్‌ జిల్లా కమిటీలో పనిచేశారు. 2003లో దండకారణ్యానికి వెళ్లి ఆదివాసీ మహిళా సంఘానికి నాయకత్వం వహించారు. ఆమె అంత్యక్రియలు మంగళవారం లింగూగూడలో నిర్వహించనున్నారు.

Comments

G
Loading comments...