Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినుకొండలో ముగిసిన సీపీఐ ప్రచార ఆందోళన పాదయాత్ర

Follow Udayam on Google
T. SRINU BABU Aug 15, 2026 7:58 PM పల్నాడుGeneral
వినుకొండలో ముగిసిన సీపీఐ ప్రచార ఆందోళన పాదయాత్ర - Udayam
కేంద్ర ప్రభుత్వ ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో ఆగస్టు 6న ప్రారంభమైన పాదయాత్ర శనివారం వినుకొండలో ముగిసింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్థానిక సీపీఐ కార్యాలయం వద్ద పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...