వార్తలకు తిరిగి వెళ్లండి

వినుకొండ ప్రభుత్వ వైద్యశాలను డిసిహెచ్ఎస్ బీవీ రంగారావు బుధవారం సాయంత్రం తనిఖీ చేశారు. వైద్యశాలలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని ఆయన చెప్పారు.
కలెక్టర్ ఆదేశాల మేరకు వినుకొండ ఆసుపత్రిని సందర్శించి వైద్యుల కొరతపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. వైద్యశాలలో నాలుగు విభాగాలకు స్పెషలిస్ట్ డాక్టర్లను డిప్యూటేషన్ పై నియమించనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

