వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక విగ్రహాల నిమజ్జనంలో డీజేల వినియోగానికి అనుమతి లేదని, అందరూ గమనించాలని లక్షెట్టిపేట ఎస్సై గోపతి సురేష్ సూచించారు. బుధవారం లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
డీజేలు వినియోగించడం వల్ల అందరూ ఇబ్బంది పడే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. దానికి బదులు ప్రత్యామ్నాయ చిన్న సౌండ్ సిస్టం వినియోగించాలన్నారు. డీజే ఆపరేటర్లు, అనుమానితులను తాసిల్దార్ ముందు బైండోవర్ చేశామని తెలిపారు.
Comments
Loading comments...

