వార్తలకు తిరిగి వెళ్లండి

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమై యువతిని మాయ మాటలతో మోసం చేసిన పవన్ సాయిని తెనాలి పోలీసులు అరెస్ట్ చేశారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేదని నమ్మించి ఆమె వద్ద నుంచి బంగారు ఆభరణాలు, నగదు తీసుకుని బెదిరింపులకు పాల్పడినట్లు తెలిపారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Loading comments...

