వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక మండపాలలో డీజేల వినియోగానికి అనుమతి లేదని లక్షెట్టిపేట ఎస్సై గోపతి సురేష్ స్పష్టం చేశారు. మంగళవారం లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్ ఆవరణలో వినాయక మండపాల నిర్వహకులతో ఆయన సమావేశం నిర్వహించారు. వినాయక మండపాల ఏర్పాటుకు నిర్వాహకులు పోలీస్ పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
వినాయక మండపాల వద్ద సీసీ కెమెరాలు బిగించాలని, శాంతిభద్రతల పరిరక్షణకు అందరూ సహకరించాలని నిర్వాహకులను ఆయన కోరారు.
Comments
Loading comments...

