వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి సందర్భంగా డీజే యజమానులు పోలీసు నిబంధనలను విధిగా పాటించాలని బాపట్ల డీఎస్పీ చంద్రమౌళి ఆదేశించారు. శుక్రవారం సీఐ రాంబాబుతో కలిసి డీజే నిర్వాహకులకు అవగాహన సమావేశం నిర్వహించారు.
రాత్రి పూట డీజేలను నిషేధించామని, పరిమిత శబ్దంతోనే సౌండ్ సిస్టమ్స్ వాడాలని తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Loading comments...

