వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలకు ఉచితంగా ఆన్‌లైన్ ద్వారా ఎన్‌ఓసీ పొందేందుకు ఈ-పోర్టల్ సేవలు ప్రారంభించినట్లు జిల్లా ఎస్పీ పి. జగదీష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
వినాయక మండపాల నిర్వాహకులు గణేష్ ఉత్సవ్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. స్థల పరిశీలన తర్వాత క్యూఆర్ కోడ్‌తో కూడిన డిజిటల్ ఎన్‌ఓసీ మంజూరు చేస్తారని పేర్కొన్నారు. మండపాల వద్ద డిజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

