Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి సందర్బంగా భక్తులతో కిటకిట

Follow Udayam on Google
Devender Bale Sep 14, 2026 8:02 PM జగిత్యాలGeneral
వినాయక చవితి సందర్బంగా భక్తులతో కిటకిట - Udayam
జగిత్యాల పట్టణంలో వినాయక చవితి సందర్భంగా టవర్ సర్కిల్, మార్కెట్, అంగడి బజార్ తదితర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. గణనాథుడి పూజా సామగ్రి, పూలు, పండ్లు తదితర వస్తువుల కొనుగోలుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో మార్కెట్ ప్రాంతాల్లో సందడి నెలకొంది. పండగ నేపథ్యంలో ఆయా ప్రాంతాలు రద్దీగా మారాయి. మరోవైపు భారీ సంఖ్యలో వినాయక విగ్రహాలను భక్తులు మండపాలకు తరలిస్తుండటంతో పట్టణంలో పండగ వాతావరణం నెలకొంది.

Comments

G
Loading comments...