వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ మినీ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం విముక్త జాతుల దినోత్సవాన్ని నిర్వహించారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్, డిప్యూటీ కలెక్టర్ రవితేజ హాజరై జ్యోతిబా ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
సంచార, విముక్త జాతుల సమస్యలు, అభివృద్ధిపై సంఘాల నాయకులు చర్చించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
Comments
Loading comments...

