వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని అనంతగిరిపల్లికి చెందిన కొత్తగాడి అమృత ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చేరారు. బాధితురాలి చికిత్స నిమిత్తం సీఎం సహాయ నిధి (CMRF) కింద రూ. 2,50,000 విలువగల ఎల్వోసీ (LOC) మంజూరైంది.
ఈ లెటర్ ఆఫ్ క్రెడిట్‌ను తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ బాధిత కుటుంబ సభ్యులకు స్వయంగా అందజేశారు.
Comments
Loading comments...

