వికారాబాద్‌లో ఆటో-లారీ ఢీ.. నలుగురి మృతి

వికారాబాద్ జిల్లాలోని బుగ్గరామేశ్వరం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెండ్లిమడుగు నుంచి కేరెల్లికి వెళ్తున్న ఆటోను మలుపు వద్ద లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే గ్రామానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు.
మృతులను ఆటో డ్రైవర్ నాగేశ్, మహిళలు చంద్రమ్మ, పార్వతమ్మ, సరితగా గుర్తించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది.
Comments
Loading comments...
