Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

వికారాబాద్ లో అగ్ని ప్రమాదం. 3 లక్షలు నష్టం.

Follow Udayam on Google
Super Admin Jul 26, 2026 5:10 PM వికారాబాద్బ్రేకింగ్ న్యూస్
వికారాబాద్ లో అగ్ని ప్రమాదం. 3 లక్షలు నష్టం. - Udayam
వికారాబాద్ జిల్లా : వికారాబాద్ పట్టణ పరిధిలోని వినాయక హిల్స్ 31వ వార్డులో స్థానిక ఇంటి యజమాని పాండు నాయక్ ఇంట్లో అద్దెకు ఉంటున్న నివాసంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలు ఒక్కసారిగా వేగంగా విస్తరించాయి. మంటలను గమనించిన కుటుంబ సభ్యులు భయంతో వెంటనే బయటకు పరుగులు తీయడంతో పెద్ద ముప్పు తప్పి, ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. అనంతరం స్థానికులు అందించిన సమాచారంతో ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో మంటలను పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకువచ్చారు.

Comments

G
Loading comments...