వార్తలకు తిరిగి వెళ్లండి

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాటపటిమను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని వికారాబాద్ కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజల హక్కులు కాపాడాలని, బానిసత్వం నుంచి విముక్తి కల్పించాలని ప్రాణాలకు తెగించి పోరాటం చేసిన మహనీయుడు సర్వాయి పాపన్న అని కొనియాడారు.
Comments
Loading comments...

