వార్తలకు తిరిగి వెళ్లండి

హీరో విజయ్ దేవరకొండ తన సొంతూరైన నాగర్‌కర్నూల్ జిల్లా తుమ్మన్‌పేట విద్యార్థులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ‘ది దేవరకొండ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన ‘మెరిట్ స్కాలర్‌షిప్ అవార్డీస్’ లబ్ధిదారుల అధికారిక జాబితాను తాజాగా విడుదల చేశారు.
అచ్చంపేట డివిజన్‌లోని 45 ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలల్లో 9, 10 తరగతుల్లో టాప్ మార్కులు సాధించిన ప్రతిభావంతులకు ఈ ఉపకారవేతనాలు అందనున్నాయి. హామీని నెరవేర్చిన విజయ్‌పై గ్రామస్థులు, అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Comments
Loading comments...
