వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామ పట్టణంలోని బీరప్పగడ్డ వీధిలో నాలుగు వీధి కుక్కలు కూలీ సలీంపై దాడి చేశాయి. ABV జూనియర్ కాలేజీ నుంచి CPM కార్యాలయానికి వెళ్లే మార్గంలోని పాత ఇనుము దుకాణంలో పనిచేస్తున్న ఆయనను కుక్కలు తీవ్రంగా కరిచాయి. దీంతో సలీంకు గాయాలయ్యాయి.
వీధి కుక్కల బెడదపై పలుమార్లు మున్సిపల్ అధికారులకు విన్నవించినా స్పందన లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...

